కరీంనగర్ జిల్లాపై ముఖ్యమంత్రికి మక్కువ
ఆ సెంటిమెంట్‌తోనే శాలపల్లి-ఇందిరానగర్‌లో పథకానికి శ్రీకారం
సీఎం కేసీఆర్‌తోనే అంబేద్కర్ కలలు సాకారం
సమీక్షలో మంత్రులు గంగుల, కొప్పుల
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం
కరీంనగర్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : అంబేద్కర్ కన్న కలలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని, ఉన్నత వర్గాలకు దీటుగా దళితులు ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ముఖ్యమంత్రికి కరీంనగర్ జిల్లా అంటే మక్కువని, ఆ సెంటిమెంట్‌తోనే ఈ నెల 16న పైలెట్ ప్రాజెక్టుగా శాలపల్లి-ఇందిరానగర్‌లో పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. సభ నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. లక్ష మందితో సభ నిర్వహిస్తున్నామని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో ఈ నెల 16న లక్షమందితో దళితబంధు సభను నిర్వహించనున్నామని మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సభ నిర్వహణపై శనివారం కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే ఎంతో మక్కువని, 2001లో ఈ గడ్డమీదే సింహగర్జన సభ నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అనేక కీలకమైన పథకాలకు ఇదే వేదిక నుంచి అంకురార్పణ చేశారని చెప్పారు. ఇదే సెంటిమెంట్‌తో ఈ నెల 16న హుజూరాబాద్ కేంద్రంగా దళిత బంధును ఆవిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు దాటుతున్నా దళితుల బతుకుల్లో వెలుగులు నిండలేదన్నారు. పాలకులు మారినా వారి స్థితిగతులు మారలేదన్నారు. ఉన్నత వర్గాలకు దీటుగా దళితులు ఎదగాలని బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని చెప్పారు. ఈ దిశగా అనేక స్కీంలను ప్రారంభించారని పేర్కొన్నారు. ఆయన అమలు చేస్తున్న పథకాలను చూసి దేశం ఈర్ష్య పడుతుంటే తెలంగాణ సమాజం గర్వపడుతున్నదని వ్యాఖ్యానించారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉన్నదన్నారు.
ఎన్నికల కోసం తీసుకురాలేదు..
కొందరు ప్రతిపక్ష నాయకులు దళితబంధుపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎన్నికల కోసం తీసుకువచ్చినట్లు విమర్శిస్తున్నారని, కానీ ఇది సత్యదూరమన్నా రు. సీఎం కేసీఆర్ వెనుబడ్డ దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే ఈ స్కీంను తీసుకువచ్చారని చెప్పారు. ఈ పథకంతో దళితుల బతుకులకు భరోసా లభిస్తుందన్నారు. గతంలో ఎ మ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు కాలిన మోట ర్లు, ఎండిన పైర్లతో వచ్చేవారని, కానీ స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు కాలం చెల్లిందన్నారు. అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉన్న తరుణంలో తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పా రు. ఇక్కడి ప్రజల స్థితిగతులపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్ అనేక గొప్ప కార్యక్రమాలను ప్రారంభించారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా 24గంటల కరెంట్, కాళేశ్వరం నిర్మించి బీడు భూములకు నీరందిస్తున్నారని చెప్పారు. రైతుబంధు, రైతుబీమాతో రైతుల బతుకులకు భరోసా కల్పించారన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలను తెచ్చారని చెప్పారు. దళిత, గిరిజన, మైనా ర్టీ, వెనుకబడిన వర్గాలకు ఉన్నతవిద్యనందించే లక్ష్యంతో గురుకులాలను ఏర్పాటు చేశారని, బీ సీ గురుకులాల సంఖ్యను 16నుంచి 261కి పెం చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
అర్హులందరికీ వర్తింపు : కొప్పుల ఈశ్వర్
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి దళితబంధు సభకు ఏర్పాట్లు చే యాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఈ స్కీం అమలుపై కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సంపూర్ణంగా చర్చించడమే కాక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్ సాచురేషన్ మోడ్‌లో ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చె ప్పారు. పైరవీలకు ఆస్కారం లేదన్నారు. 16న జరిగే సభా వేదిక, సభా స్థలి, పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్ ఉన్నారు.
సభను విజయవంతం చేయాలి
జమ్మికుంట, ఆగస్టు 7: ఈ నెల 16న నియోజకవర్గంలో నిర్వహించచనున్న దళితబంధు సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం ఎంపీఆర్ గార్డెన్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అపూర్వ విజయానికి అందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. బీజేపీకి నియోజకవర్గంలో పునాదుల్లేవని, టీఆర్ఎస్తో పోల్చితే చాలా చిన్నదన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒకరినీ కలిసి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేయాలని సూచించారు. దళితబంధు పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం చెప్పి బహిరంగ సభను దిగ్విజయం చేద్దామని చెప్పారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ స్వప్న, టీఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, మల్లయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.