గంగాధర, నవంబర్ 6: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని గర్శకుర్తి, రంగరావుపల్లి, ఉప్పరమల్యాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ర్టాన్ని తయారు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సాగు విస్తీర్ణంతో పాటు ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా సర్కారు గ్రామాలోన్లే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు అలువాల నాగలక్ష్మి, పాశం స్వప్న, బొల్లాడి మంజుల, ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, ద్యావ మధుసూదన్‌రెడ్డి, ముద్దం జమున, నాయకులు అలువాల తిరుపతి, పాశం కుమార్, ముద్దం నగేశ్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, తడిగొప్పుల రమేశ్ పాల్గొన్నారు.
రామడుగు మండలంలో..
రామడుగు, నవంబర్ 6: మండలంలోని వెంకట్రావుపల్లి, గుండి, రామడుగు, వన్నారం, వెదిర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. కార్యక్రమాల్లో రామడుగు, కొక్కెరకుంట సింగిల్‌విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వరరావు, వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఎంపీపీ కలిగేటి కవిత, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు జవ్వాజి శేఖర్, గుండి మానస, పంజాల ప్రమీల, జాడి లక్ష్మి, తీగల సంగీత, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.