నల్లచట్టాలతో కర్షకులకు తీరని అన్యాయం
ధాన్యం కొనకుండా ఇబ్బంది పెడుతున్నది నిజం కాదా..?
చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్
బోయినపల్లి, నవంబర్ 6: ‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులను నిండా ముంచుతున్నది. నల్లచట్టాలతో తీరని అన్యాయం చేస్తున్నది’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. శనివారం సాయంత్రం బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించి, మాట్లాడారు. రెండేళ్ల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నదని, చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే రైతులపై వాహనా లు ఎక్కించి చంపింది వాస్తవం కాదా..? చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు రైతుల మీద ప్రేమ ఉంటె ధాన్యం మొత్తం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కొనమని కొర్రీలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. ప్రతి పక్షాలు ఎన్ని మాట్లాడినా.. ఎన్ని ఆరోపణలు చేసినా రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. ఇక్కడ సింగిల్ విండో ఛైర్మన్ వేసిరెడ్డి దుర్గారెడ్డి, సర్పంచ్లు ఇల్లందుల శంకర్, శ్రీనివాస్, కరీంనగర్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్లున్నారు.