ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత
రామడుగు, ఆగస్టు 6: టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు దాసరి బాబు మృతిచెందగా, రూ.రెండు లక్షల బీమా మంజూరైంది. కాగా, శుక్రవారం ఆయన బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, దాసరి బాబు 2001 నుంచి పార్టీలో కీలకంగా ఉంటూ ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలిపారు. పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా వ్యవహరించిన దాసరి బాబు దురదృష్టవశాత్తు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం ట్రస్టు బోర్డు డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ రజబ్ అలీ, ఏఎంసీ డైరెక్టర్ పైండ్ల శ్రీనివాస్, కట్కూరి మల్లేశం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ, నాయకులు కలిగేటి లక్ష్మణ్, పూడూరి మల్లేశం, కర్ర శ్యాంసుందర్ రెడ్డి, బాపురాజు, ఎన్ అంజయ్య గౌడ్, పైండ్ల తిరుపతి, ముదుగంటి రాజిరెడ్డి, కొలిపాక కమలాకర్, బుధారపు కార్తీక్, బుర్ర గంగయ్యగౌడ్, పురాణం రమేశ్, ఎలిగేటి మహేశ్, కర్ర రాజిరెడ్డి, ఏగోలపు కొమురయ్య పాల్గొన్నారు.