సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలి
వాడవాడలా టీఆర్ఎస్ శ్రేణుల విస్తృత ప్రచారం
హుజూరాబాద్‌టౌన్, ఆగస్టు 6: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్కు ఓటేయ్యండి, సీఎం కేసీఆర్‌కు అండగా నిలవండి అంటూ పట్టణంలోని వాడవాడలా పార్టీ శ్రేణులు శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని 2, 15, 17, 19, 26, 27వ వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. 19వ వార్డులోని పోచమ్మ ఆలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబంధు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి చేసింది ఏమి లేదని, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, మభ్య పెడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు గడప గడపకూ వెళ్లి వివరించారు. కేంద్రంలోని వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బీ యాదగిరినాయక్, కల్లెపల్లి రమాదేవి, ఉజ్మానూరిన్, గోస్కుల రాజు, కేసిరెడ్డి లావణ్య, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు గందె సాయిచరణ్, ప్రధాన కార్యదర్శి ఎండీ రియాజ్, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ జమీలొద్దీన్, సాబీర్‌పాషా, కొత్తపల్లి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు మున్వర్‌ఖాన్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు బీఎస్ ఇమ్రాన్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కాశెట్టి శ్రీనివాస్, మహంకాళి నవీన్, నాయకులు చొల్లేటి శ్యాం, ఉప్పు శ్రీనివాస్, కల్లెపల్లి రోషేందర్, వెంకటరమణగౌడ్, సాయి, కిరణ్, కోనేటి రమేశ్, మోతె రమేశ్, కే పవన్, వలబోజు తిరుమల్చారి, పుల్లూరి శ్రీకాంత్, కొయ్యడ దోని, వేముల రాజేశం, యాళ్ల రేణుక, ఆడెపు శ్రీనివాస్, తిరుపతి, కృష్ణమూర్తి, నర్సన్న, ఎస్ చారి, జమీర్, శివరాం, మజీద్, కరుణాకర్, చాంద్‌పాషా, హమీద్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.
వెంకట్రావుపల్లి ఎస్సీ కాలనీలో..
హుజూరాబాద్ రూరల్,అగస్టు 6: హుజూరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి దళితకాలనీలో శుక్రవారం సైదాపూర్ మండల సర్పంచుల ఫోరం నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. కరపత్రాలు పంచుతూ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. దళితబంధును అమలు చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల ఈ ప్రాంత ప్రజలకు చేసిందేంలేదని చెప్పారు. ఆగమైతే గోస పడతారని పేర్కొన్నారు. కారుగుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ సైదాపూర్ మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, సర్పంచులు బత్తుల కొమురయ్య, పైదిమల్ల సుశీల తిరుపతిగౌడ్ , పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నరకుడు మధుకర్, చిన్నకొడూరు మారెట్ వైస్ చైర్మన్ పొన్నం రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మేకల మల్లారెడ్డి ,స్థానిక నాయకులు మహేశ్, మధుకర్, రామగిరి సమ్మయ్య, చొప్పదండి మొగిలి, చొప్పదండి పోశయ్య, చొప్పదండి సునీల్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.