ఎవరూ హాని తలపెట్టవద్దు
కరీంనగర్ సీఎఫ్‌వో సైదులు
మంథని రూరల్/ ముత్తారం డిసెంబర్ 4: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ అడవుల నుంచి అడవిసోమన్‌పల్లి గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి ప్రవేశించినట్లు కరీంనగర్ సీఎఫ్‌వో సైదులు తెలిపారు. శనివారం ఆయన అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి అటవీప్రాంతాల్లో పర్యటించారు. ఇక్కడి మానేరు నది పరిసరాల్లో పులి అడుగుల కోసం అన్వేషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపులి గతేడాది మానేరు నదిని దాటి అడవిశ్రీరాంపూర్ మీదుగా ముత్తారం మండలంలోకి ప్రవేశించిందని వెల్లడించారు. అడవిసోమన్ పల్లి, వెంకటాపూర్, ఆరెంద, ఖాన్సాయిపేట, బట్టుపల్లి, చిన్న ఓదాల, గోపాల్పూర్, ఖానాపూర్ తదితర అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొర్లు, బర్ల, ఎడ్ల కాపలాదారులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. పొలాలు, చేన్ల వద్ద ఎలాంటి కరెంట్ ఉచ్చులను అమర్చవద్దని సూచించారు.