హౌసింగ్‌బోర్డుకాలనీ, జనవరి 3: సమస్యలను ప్రాధాన్యతతో పరిషరించాలని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చిన సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిషరించాలన్నారు. పలువురు ఫోన్ ద్వారా సమస్యలు తెలుపగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్డీవో శ్రీలత, ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాస్, డీపీవో వీరబుచ్చయ్య, ల్యాండ్ సర్వే అధికారి అశోక్, మారెటింగ్ శాఖ డీడీ పద్మావతి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నేతానియల్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మత్స్యశాఖ ఏడీ రాజనర్సయ్య, డీవైఎస్వో రాజవీరు, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, ఆడిట్ శాఖ ఉపసంచాలకులు రాము తదితరులున్నారు.
ప్రజావాణికి 84 దరఖాస్తులు
ప్రజావాణి సమస్యలను వేగవంతంగా పరిషరించాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 84మంది సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు సమర్పించగా ఆయన స్వీకరించారు. ఇందులో 47 రెవెన్యూ, 8 ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన సమస్యలు కాగా, మిగతా 29 ఇతర శాఖలకు సంబంధించినవని పేర్కొన్నారు. ఆర్డీవో ఆనంద్‌కుమార్, డీఆర్డీవో శ్రీలత, ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాస్, డీపీవో వీరబుచ్చయ్య, కలెక్టరేట్ ఏవో లక్ష్మీరెడ్డి, ల్యాండ్ సర్వే అధికారి అశోక్, మారెటింగ్ శాఖ డీడీ పద్మావతి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు నేతానియల్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మత్స్యశాఖ ఏడీ రాజ నర్సయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, అగ్ని మాపక శాఖ అధికారి వెంకన్న, ఆడిట్ శాఖ ఉపసంచాలకులు రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.