సంక్షేమ సారథి కేసీఆర్కు అండగా నిలువాలి
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఇల్లందకుంట మండలం టేకుర్తిలో ఇంటింటా ప్రచారం
ఇల్లందకుంట, సెప్టెంబర్ 2: దళితబంధు పథకంతో దళితుల తలరాతలు మారుతాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు హుజూరాబాద్ ప్రజలు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని టేగుర్తిలో నిర్వహించిన ఇంటింటా ప్రచారానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శీను గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. ‘హుజూరాబాద్ గడ్డ 2001 నుంచి గులాబీ పార్టీ అడ్డా..అని ఈ ఉప ఎన్నికలో సైతం భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో కీలకభూమిక పోషించిన నిరుపేద కుటుంబానికి చెందిన గెల్లు శీనును గెలిపించాలని అభ్యర్థించారు. ‘బీజేపీ బడా ఝూటా పార్టీ..అని అభివర్ణించారు. రైతులు ఏడాదిన్నరగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతాంగానికి ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు ఇస్తున్న కేసీఆర్ సర్కారుకు అండగా నిలువాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ మానస, ఎంపీటీసీ ఐలయ్య, టీఆర్ఎస్ నాయకులు నగేందర్, వాసు, తిరుపతి, రమేశ్ పాల్గొన్నారు.