రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలకు ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులు
జగిత్యాల నుంచి ముగ్గురు
కరీంనగర్ జిల్లాకు పతకాల పంట
20 మంది ఎంపిక
రాజన్న సిరిసిల్ల నుంచి 12 మంది, పెద్దపల్లి జిల్లా నుంచి పది మంది
రాంనగర్/ సిరిసిల్ల రూరల్/ జగిత్యాల కలెక్టరేట్/ ఫర్టిలైజర్ సిటీ, జనవరి 2;ఉత్తమ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పోలీస్ సేవా పతకాలకు ఉమ్మడి జిల్లా నుంచి పలువురు పోలీస్ అధికారులు ఎంపికయ్యారు. ఈ మేరకు సేవా పతకాలకు ఎంపికైన వారి పేర్లను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 12 మంది..
వేములవాడ టౌన్ పరిధిలోని ఎస్ఐ పిల్లి రామచంద్రం మహోన్నత సేవా పతకానికి ఎంపిక కాగా, పోలీస్ సేవా పతకాలకు సిరిసిల్ల టౌన్ ఏఎస్ఐ మహ్మద్ ఖాజా జమీలొద్దీన్, ఏఎస్ఐ పర్వతి మల్లయ్య, వేములవాడ టౌన్ ఏఎస్ఐ బద్రి రామస్వామి, కోనరావుపేట ఏఎస్ఐ సంటి ప్రమీల, ఇల్లంతకుంట పీఎస్ ఏఎస్ఐ పల్లి ఉమరాణితో పాటు ఏఆర్ఎస్ఐలు కుత్తడి పోచయ్య, పీ రాజేశం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగవెల్లి సదానందం, కోనరావుపేట పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ దామరపల్లి బాపురెడ్డి, తంగళ్లపల్లి పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటరెడ్డి, సిరిసిల్ల టౌన్ పీఎస్‌లోని కానిస్టేబుల్ నీలం జగదీశ్వర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులను ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు.
కరీంనగర్ జిల్లా నుంచి 20 మంది..
కరీంనగర్ జిల్లా పోలీసులకు వివిధ స్థాయిల్లో 20 పతకాలు దకాయి. ఇందులో 18 మంది సివిల్ పోలీసులు కాగా, పీటీసీ కానిస్టేబుల్, ఏసీబీ కానిస్టేబుల్‌కు కూడా చోటు దకింది. పతకాలు పొందిన వారిలో టాస్‌ఫోర్స్ సీఐ సృజన్‌రెడ్డి, లేక్ పోలీస్ ఎస్ఐ వెంకట్ రెడ్డి, ఇల్లందకుంట ఏఎస్ఐ గౌస్ ఖాన్, కరీంనగర్ ట్రాఫిక్ ఏఎస్ఐ భాసర్ రెడ్డి, రామడుగు ఏఎస్ఐ అనంతరెడ్డి, కరీంనగర్ రూరల్ ఏఎస్ఐ ఠాకూర్ శంకర్ సింగ్, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ భాసర్, వీణవంక పీఎస్ కానిస్టేబుల్ రమణారెడ్డి, కరీంనగర్ త్రీటౌన్ కానిస్టేబుల్ శ్రీనివాస్, గన్నేరువరం పీఎస్ కానిస్టేబుల్ కొమురయ్య, ఏఆర్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్, చొప్పదండి ఏఎస్ఐ యూసుఫ్ షరీఫ్, మానకొండూర్ పీఎస్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, తిమ్మాపూర్ పీఎస్ కానిస్టేబుల్ మొగిలయ్య, కొత్తపల్లి పీఎస్ కానిస్టేబుల్ బలరాం, కరీంనగర్ వన్ టౌన్ పీఎస్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కేశవపట్నం పీఎస్ కానిస్టేబుల్ చంద్రమౌళి, హుజూరాబాద్ పీఎస్ కానిస్టేబుల్ మొగిలయ్య, కరీంనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, ఏసీబీ పోలీసు కానిస్టేబుల్ వేణుగోపాల్, పీటీసీ డీఏసీ నల్లమల్ల రవి ఉన్నారు.
జగిత్యాల నుంచి ముగ్గురు..
జగిత్యాల జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులు సేవా పతకాలకు ఎంపికయ్యారు. రాయికల్, సారంగాపూర్ పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య, బొమ్మెన గజేందర్, కొడిమ్యాల పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ మాలోతు రాజు సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవలందించి సేవా పతకాలు సాధించిన ముగ్గురు పోలీసులను జిల్లా ఎస్పీ సింధూశర్మ అభినందించారు.
పెద్దపల్లి నుంచి పది మంది..
పెద్దపల్లి జిల్లా రామగుండం సీసీఎస్ ఏసీపీ దేవీ రమణబాబు, రామగుండం సీఏఆర్ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సారంగపాణి, రామగుండం సీఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ సత్తయ్య ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. కమాన్‌పూర్ ఏఎస్ఐ వీ రామలక్ష్మి, రామగుండం ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ ఎండీ సులేమాన్, రామగుండం సీఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ అలీబిన్ సాలేహ్, రామగుండం సీఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ సీహెచ్ రవీందర్, మంథని హెడ్‌కానిస్టేబుల్ ఎం రమేశ్, రామగుండం సీఏఆర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ టీ శ్రీనివాస్, అంతర్గాం కానిస్టేబుల్ కే కరుణాకర్ సేవా పతకాలకు ఎంపికయ్యారు.