హుజూరాబాద్‌టౌన్, ఆగస్టు 17: శాలపల్లి-ఇందిరానగర్‌లో సోమవారం దళితబంధు ప్రారంభోత్సవ సభకు పూర్తి స్థాయి ఏర్పాట్లు, జనసమీకరణ చేయడం అభినందనీయమని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్అర్బన్ జడ్పీ చైర్మన్ ఎం సుధీర్‌కుమార్ కొనియాడారు. సభ విజయవంతానికి తనవంతు కృషి చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌కు హుజూరాబాద్‌లో మంగళవారం వారు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సభ విజయవంతానికి కృషి చేసిన బండ శ్రీనివాస్‌పై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, దళితబంధు మండల కో-ఆర్డినేటర్ మొలుగూరి ప్రభాకర్, కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, ముక్క రమేశ్, బర్మావత్ యాదగిరినాయక్, మక్కపెల్లి కుమార్‌యాదవ్, టీఆర్ఎస్, దళిత నాయకులు దొంత రమేశ్, మొలుగు పూర్ణచందర్, పోతరవేణి అనిల్‌యాదవ్, బత్తుల రాజలింగం, బత్తుల సమ్మయ్య, కన్నెబోయిన శ్రీనివాస్‌యాదవ్, దళితబంధు పథకం కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు కృతజ్ఞతలు
శాలపల్లి-ఇందిరానగర్‌లో దళితబంధు ప్రారంభోత్సవ సభ విజయవంతానికి కృషి చేసిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సతరించి, కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.