కమాన్‌చౌరస్తా, ఆగస్టు 31: కృష్ణాష్టమిని పురస్కరించుకొని నగరంలోని వావిలాలపల్లి, సప్తగిరికాలనీ రామాలయాల్లో, మారెట్ కోడ్, మంకమ్మతోట, విద్యానగర్, భగత్‌నగర్ వేంకటేశ్వరాలయాల్లో, కట్టరాంపూర్ లక్ష్మీగోదాసమేత వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక అర్చనలు నిర్వహించారు. 33వ డివిజన్ భగత్‌నగర్‌లో ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో, అయ్యప్ప ఆలయ సమీపంలో నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమానికి మేయర్ వై సునీల్ రావు హాజరై పూజలు నిర్వహించి, ప్రారంభించారు. కార్యక్రమంలో ఐలయ్య, నరేందర్, జితేందర్, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, పల్లె నారాయణ, బాలు, విజయ్, శ్రీనివాస్, కాలనీవాసులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 31: పట్టణంలోని ఏడో వార్డులో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా జరుపుకొనే పండుగ కృష్ణాష్టమి అని అన్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో యాదవ కులస్తులతో పాటు నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు రాజేశం, పద్మ, ఎండీ ఖాజాఖాన్, శంకరయ్య, ఆంజనేయులు, మల్లేశం, శంకరయ్య, వేముల వెంకటేశం పాల్గొన్నారు.
మండలంలోని ఎలబోతారం రాధాకృష్ణ మందిరంలో ప్రధాన అర్చకుడు మల్లికార్జునాచార్యులు, ఆలయ ధర్మకర్త కరివేద వేణుమాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
వెలిచాల శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని పూజలు నిర్వహించారు. సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్‌రావు దంపతులు, భక్తులు స్వామి వారిని దర్శించుకొని, పూజలు చేశారు. మాజీ సర్పంచ్ రవీందర్రావు, అర్చకుడు రామానుజ శర్మ, భక్తులు పాల్గొన్నారు.