ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ
గంగాధర, ఫిబ్రవరి 11: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని గర్శకుర్తిలో రూ.9.20లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మిస్తున్న మహిళా సంఘం భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో స్వశక్తి సంఘం మహిళలు గ్రామ పంచాయతీ వద్ద లేదా సంఘం అధ్యక్షురాలి ఇంటి వద్ద సమావేశాలు నిర్వహించుకునేవారని గుర్తు చేశారు. భవన నిర్మాణం పూర్తయితే వారి ఇబ్బందులు తొలుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కురిక్యాల, గంగాధర విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్‌రావు, దూలం బాలగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ పుల్కం గంగన్న, విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏపీఎం పవన్‌కుమార్, సర్పంచ్ అలువాల నాగలక్ష్మి, ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, నాయకులు అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, మామిడిపెల్లి అఖిల్, మహిళా సంఘం సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
సమ్మక్క జాతర పోస్టర్ ఆవిష్కరణ
మధురానగర్ సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అదే గ్రామంలో ఆవిష్కరించారు. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, నాయకులు వేముల అంజి, పెంచాల చందు, గొంటి సంజీవ్, నరుకుల్ల గంగయ్య, నలువాల వేణు పాల్గొన్నారు.
నిధుల మంజూరుపై హర్షం
రామడుగు, ఫిబ్రవరి 11: గోపాల్రావుపేటలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.25 లక్షల నిధులను విడుదల చేయడంపై ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి హర్షం వ్యక్తంజేశారు. శుక్రవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. గ్రామాభివృద్ధికి సహకారం అందించడంతో కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు నేరెల్ల అంజయ్యగౌడ్, పూడూరి మల్లేశం, వెదిర ఎంపీటీసీ తొనికొండ అనిల్‌కుమార్, మాజీ ఎంపీపీలు తౌటు మురళి, మామిడి తిరుపతి, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, మొయిజ్ తదితరులున్నారు.