చిగురుమామిడి, సెప్టెంబర్ 6 : పార్టీ బలోపేతం కోసం గ్రామ కమిటీలు కీలకమని ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి పేర్కొన్నారు. మండలంలోని ఇందుర్తి, ఓగులాపూర్‌లో సోమవారం గ్రామ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు లభిస్తుందన్నారు. గ్రామ కమిటీల నియామకం అనంతరం మండల కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా సాంసృతిక విభాగం అధ్యక్షురాలు ఎడవల్లి విజయ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బద్ధం నరసింహారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ అందె సుజాత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రవి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపెల్లి మల్లేశం, నాయకులు సిరాజ్, శ్రీనివాస్, అందె పోచయ్య, ఆంజనేయులు, తోట సతీశ్, కోమటిరెడ్డి భగవాన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బద్ధం తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం జంగపెల్లిలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా మహంకాళి ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా అనుమాండ్ల రాజేశం, అనవేని రాజేశం, ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ నియామకమయ్యారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ బోడ మాధవరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తాడూరి వెంకటరమణారెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్లు గంప వెంకన్న, అటికం రవికుమార్ గౌడ్, నాయకులు అనుమాండ్ల మల్లేశం, గుంటుక లింగయ్య పాల్గొన్నారు.
పర్లపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ ..
పర్లపల్లిలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు సర్పంచ్ మాదాడి భారతి, ఎంపీటీసీ ముప్పిడి సంపత్‌రెడ్డి, ఉప సర్పంచ్ సుద్దాల రాజేశ్‌గౌడ్, కమిటీ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పర్లపల్లి అధ్యక్షుడిగా తాటిపల్లి చంద్రమౌళి, ఉపాధ్యక్షులుగా బండి రాజు, రెడ్డి సదయ్య, కార్యదర్శిగా ఎస్కే సాజిద్, సంయుక్త కార్యదర్శిగా ఆరెల్లి మల్లేశ్, కోశాధికారిగా తాటిపల్లి సతీశ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. గ్రామ యూత్ కమిటీ అధ్యక్షుడిగా బాగోతం తిరుపతి, ఉపాధ్యక్షులుగా గూడెపు సతీశ్, ఎండీ జావిద్, కార్యదర్శిగా కామల్ల వేణు, సంయుక్త కార్యదర్శిగా ఏనుగుల కుమార్‌ను ఎన్నుకున్నారు. బీసీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా కొత్త వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కీసర మహేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బెజ్జంకి సంపత్, ఉపాధ్యక్షుడిగా తాటిపల్లి చంద్రమౌళి ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.