హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 30: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పట్టణంలోని 3, 8, 9, 13, 15, 22వ వార్డుల్లో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి, ప్రభుత్వ పథకాలు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత టీఆర్ఎస్దేనని, ఉప ఎన్నికలో పార్టీకి అండగా నిలువాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
గెల్లును గెలిపించాలి: జడ్పీ చైర్పర్సన్
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ప్రజలను కోరారు. సోమవారం మండలంలోని మల్యాల గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉడుత వీరస్వామి, ఉప సర్పంచ్ కుమారస్వామి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాజయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.కందుగుల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ సతీమణి గెల్లు శ్వేత సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెడుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆమె వెంట ఎంపీపీ ఇరుమల్ల రాణి, సర్పంచ్ ప్రభావతి, ఎంపీటీసీ పద్మ, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.