రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
తిమ్మాపూర్ (మానకొండూర్ రూరల్), ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల, మల్లాపూర్, మక్తపల్లి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.