ద్యావన్పల్లిలో 20 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
పట్టాలు అందజేత
కలెక్టర్‌తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్ రూరల్, ఫిబ్రవరి 11 : నిరుపేదల సొంతింటి కల సాకారమైంది. సీఎం కేసీఆర్ సంకల్పంతో వారికి నిలువ నీడ దొరికింది. ఆత్మ గౌరవంతో బతుకుతామన్న ధీమా పెరిగింది. రాయికల్ మండలం ద్యావన్పల్లిలో 20 డబుల్ బెడ్రూం ఇండ్లను కలెక్టర్ రవితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
అర్హులందరికీ ఇండ్లు: ఎమ్మెల్యే
నిరుపేదలు ఆత్మగౌరవంతో బతుకాలనే సీఎం కేసీఆర్ సంకల్పంతో సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. అర్హులందరికీ డబుల్ ఇండ్లు ఇవ్వడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో కూడిన ఇండ్లను నిర్మించి ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటివరకు 600 మందికి పైగా మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా డబ్బులు అందజేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాయికల్ మండలం కొత్తపేట్ నాగాలయానికి కొత్తగా నియామకమైన చైర్మన్ దనకంటి ప్రవీణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఒడ్డెర కాలనీలో సీసీరోడ్డు, పోచమ్మ ఆలయం, ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, రాయికల్ ము న్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ముఖీద్, సర్పంచులు భూక్యా యమున, అనుపురం శ్రీనివాస్, పాలకుర్తి రవి, బత్తిని రాజేశం, ఎంపీటీసీలు పద్మ, దొంతి నాగరాజు, టీఆర్ఎస్ రాయికల్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, నాయకులు మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్, తలారి రాజేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మా జీవితంలో నిజమైన పండుగ
చిన్న గుడిసెలో వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఇన్నాళ్లూ ఇబ్బందులు పడ్డం. మాకు ఈ రోజు నిజమైన పండుగ. కూలి చేసుకొనే మాకు పొట్ట గడవడమే కష్టంగా ఉండె. సొంతిల్లు లేకపాయే అని రంది ఉండె. కేసీఆర్ సారు దేవుడి రూపంలో వచ్చి కొత్తిళ్లు కట్టించి ఇచ్చిండు. ఇప్పుడు ఇల్లు లేదనే లోటు మా పిల్లలకు ఉండదు. అందరి ముందు తలెత్తుకొని బతుకుతం.
– బానోతు లక్ష్మి