కొత్తపల్లి, ఆగస్టు 30 : విశాఖపట్నంలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరిగిన సౌత్ ఇండియా స్థాయి సుమన్ కప్ కరాటే చాంపియన్‌షిప్-2021 పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సోమవారం అభినందించారు. ఈ పోటీల్లో కరీంనగర్‌కు చెందిన కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్కు చెందిన కరాటే క్రీడాకారులు అత్యంత ప్రతిభను కనబరిచి గ్రాండ్ చాంపియన్‌షిప్‌తో పాటు పలు పతకాలను కైవసం చేసుకున్నట్లు కోచ్ గౌరు రాజిరెడ్డి తెలిపారు. కటాస్, స్పారింగ్ జూనియర్ బాలికల విభాగంలో ఏ సహస్ర 2 బంగారు పతకాలు, డీ లాస్యశ్రీ బంగారు, రజత పతకాలు, బాలుర విభాగంలో ఏ సాత్విక్ బంగారు పతకం, ఆర్యన్ రజత పతకం, ఎం సాయితేజ స్పారింగ్లో రజత పతకం సాధించారు. బాలుర సీనియర్స్ విభాగంలో జీ చిరంజీవి చాంఫియన్‌షిప్ సాధించారు. గ్రాండ్ చాంపియన్‌షిప్ ట్రోఫీని సినీనటుడు సుమన్ చేతుల మీదుగా అందుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గణేశ్ అభినందించారు.
సీఎస్‌కేఐ క్రీడాకారుల ప్రతిభ
విశాఖపట్నంలో జరిగిన సౌత్ ఇండియా కరాటే పోటీల్లో కరీంనగర్‌కు చెందిన కాంటినెంటల్ షోటోకాన్ కరాటే డో ఇండియా (సీఎస్‌కేఐ)కి చెందిన క్రీడాకారులు ప్రతిభను చాటి పతకాలు సాధించినట్లు సీఎస్‌కేఐ ఇండియా చీఫ్ శ్రీనివాస్ తెలిపారు. జీ శ్వేత కాంస్యం, డీ రిషికేశ్వర్ బంగారు, రజత పతకాలు, కే పావని బంగారు, కాంస్య పతకాలు, కే సాయిచరణ్ రజతం, అబ్దుల్ బంగారు, జీ అనన్య బంగారు, రజత పతకాలు సాధించారన్నారు. వీరికి సినీనటుడు సుమన్ పతకాలను అందజేశారు. వీరిని సీఎస్‌కేఐ చైర్మన్ చల్ల హరిశంకర్, కార్యదర్శి మాడుగుల ప్రవీణ్, కోశాధికారి వంగల శ్రీధర్, సభ్యుడు ఆర్ ప్రసన్నకృష్ణ అభినందించారు.