బుధవారం 27 జనవరి 2021
Jayashankar - Jan 14, 2021 , 01:41:42

వాలీబాల్‌ టోర్నీ విజేత మోదేడు

వాలీబాల్‌ టోర్నీ విజేత మోదేడు

మహదేవపూర్‌, జనవరి 13: మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ క్రీడా మైదానంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు మండలాల స్థాయి వాలీబాల్‌ క్రీడా పోటీల్లో పలిమెల మండల మోదేడు టీం విజేతగా నిలిచింది. మంగళ, బుధవారాల్లో వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. మోదేడు, బొడాయిగూడెం టీంల మధ్య బుధవారం ఫైనల్‌ పోటీలు నిర్వహించారు. మోదేడు జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా మోదేడు టీంకు రూ.10,116, ద్వితీయస్థానంలో నిలిచిన బొడాయిగూడెం టీంకు రూ.5,116 నగదు ప్రోత్సాహకాన్ని కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో మహదేవపూర్‌, కాటారం సీఐలు అంబటి నర్సయ్య, హతిరాం, మహదేవపూర్‌, కాళేశ్వరం, పలిమెల ఎస్సైలు అనిల్‌కుమార్‌, నరహరి, శ్యాంరాజ్‌ పాల్గొన్నారు.logo