శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jayashankar - Nov 22, 2020 , 01:37:46

‘ధర్నాలతో సంస్థకు నష్టం కలిగించొద్దు’

‘ధర్నాలతో సంస్థకు నష్టం కలిగించొద్దు’

భూపాలపల్లి : ధర్నా చేయడం వల్ల పనుల్లో జాప్యం జరిగి సం స్థకు నష్టం వాటిల్లుతుందని, సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని భూపాలపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్‌) మంచాల శ్రీనివాస్‌ సూచించారు. శనివారం వివిధ డిమాండ్ల సాధన కోసం భూపాలపల్లి ఏరియా స్టోర్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు స్టోర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్లు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, సీఎంపీఎస్‌ చిట్టీలు అందించడం లేదని ఆరోపించారు. డీజీఎం(పర్సనల్‌)శ్రీనివాస్‌, డీజీఎం(ఈఅండ్‌ఎం)దయానంద్‌ సంబంధిత సంఘం కార్మికుల నాయకులు, కాంట్రాక్ట్‌ కార్మికులతో చర్చించారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కాంట్రాక్ట్‌ కార్మికులు ధర్నా విరమించుకున్నారు.