e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home జనగాం వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం

వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం

  • స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించిన సర్పంచ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన్‌
  • వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  • భక్తులతో కిటకిటలాడిన పెంబర్తి ఆలయం

జనగామ రూరల్‌, నవంబర్‌29 : మంగళవాయిద్యాలు, వేదపండితుల ఆశీర్వచనాలు, భక్త జనసందోహం నడుమ శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. మండలంలోని పెంబర్తి ఆలయంలో సోమవారం ప్రధాన రుత్వికుడు శంకరాచార్యుల సమక్షంలో స్వామివారి కల్యాణం కన్నులపండువగా జరిగింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, స్వామివారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను సర్పంచ్‌ అంబాల ఆంజనేయులు దంపతులు, జనగామ మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ బాల్దె విజయ సిద్దిలింగం దంపతులు సమర్పించారు.

ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఆలయ శిఖరంలో ఇత్తడి కలశాన్ని కూరోజు బుచ్చయ్య చారి సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు అహర్నిశలు శ్రమించిన దాతలతోపాటు అడ్వకేట్‌ మల్యాల శివ కుమార్‌ను గ్రామస్తులు అభినందించారు. సర్పంచ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన్‌తోపాటు బొడిగె శ్రీను, మల్యాల శివ కుమార్‌, మాల్యాల కృష్ణ దంపతులు పాల్గొని స్వామివారి కల్యాణం జరిపించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో శ్రీసీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు స్వామివారి కల్యాణం జరిపించడం గొప్ప శుభ శుచకమన్నారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువతో సత్కరించగా, భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నిమ్మతి దీపిక, ఎంపీటీసీ మూల రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ చినబోయిన రేఖారాజు, మాజీ ఎంపీటీసీ మోత్కూరి కావ్యశ్రీకిషన్‌, మేదరి రామచంద్రం, వార్డు సభ్యులు పంపర మల్లేశం, ఆకుల లతశ్రవణ్‌, సంకటి యాదగరి, గొలుసుల దుర్గ్గాచలం, నిడిగొండ రాజు, పంచాయతీ కార్యదర్శి ప్రపుల్‌ రెడ్డి, వీఆర్‌ఏ అయిలుమల్లు, కారోబార్‌ వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరాలయంలో సామూహిక వ్రతాలు

స్టేషన్‌ ఘన్‌పూర్‌ : మండల కేంద్రంలోని శివునిపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. ధర్మకర్తలు గోలి ప్రశాంత్‌ దంపతులు గోలి ప్రశాంత్‌, గోలి లక్ష్మి నేతృత్వంలో పూజలు చేశారు. మహిళలు ఐదు కుంచాల కుంకుమ, ఐదు కుంచాల పసుపు, పండ్లతో మొక్కులు చెల్లించారు. అర్చకులు చెంగోలు వెంకటాచార్యులు, కలకోట రంగాచార్యులు ముత్తయిదువులతో వ్రతా లు చేయించారు. ఈ నోము నోమిన వారు పసుపు, కుంకుమలతో దంపతులు అన్యోన్యంగా ఉండడంతోపాటు నిండునూరేళ్లు జీవిస్తారని అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు పసుపు, కుంకుమలను వాయినంగా ఇచ్చారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement