బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Mar 07, 2020 , 02:26:28

కల్యాణం..కమనీయం

కల్యాణం..కమనీయం

చిలుపూర్‌, మార్చి 6 : చిలుపూర్‌ బుగులు వెంకటేశ్వరుడి క ల్యాణం శుక్రవారం కమనీయంగా జరిగింది. జయజయధ్వా నాలతో ఆ ప్రాంతం మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గుట్ట పైన ఉన్న వేంకటేశ్వరస్వామి-పద్మావతి అమ్మవార్లకు అరుణ్‌కుమారాచార్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాన్ని కాల్చారు. భక్తులు విగ్రహాలను పల్లకిలో ఎక్కించి గుట్టపై నుంచి కిందికి తీసుకువచ్చారు. ఆరుబయట కాలక్షేప మండపంలో 12 గంటలకు కల్యాణం ప్రారంభమైంది. ప్రధాన అర్చకులు శేషాచార్యులు, రంగాచార్యులు, రవీంద్రశర్మ, వెంకట రమణాచార్యులు, కిరణ్‌కుమారాచార్యులు, సిద్ధార్థాచార్యులు, సంతోశ్‌కుమారాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణాన్ని ఘనంగా జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు మండలంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుం చి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పూ జలు చేసి మొక్కులు చెల్లించారు. 


అనంతరం ఉత్సవ విగ్రహాలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, చైర్మన్‌ ఇనుగాల న ర్సింహారెడ్డి, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితబాలరాజు,  గ్రంథాలయ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, సీఐ రాజిరెడ్డి, ఈవో లక్ష్మీప్రసన్న, ధనుంజయశర్మలతో పాటు భక్తులు ముత్యాల పల్లకిలో గర్భగుడికి తరలించారు. కల్యాణ మహోత్సవంలో జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బెలిదె వెంకన్న, ఎడవెల్లి మాధవరెడ్డి, సంగోజు మోహన్‌, ఉత్సవ కమిటీ సభ్యులు కుమార్‌, రంగరాజు, గంగాధర్‌రెడ్డి, నారగోని రాజు, విజయ్‌కుమార్‌, చిలుపూర్‌ సర్పంచ్‌ ఉద్దెమారి రాజ్‌కుమార్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ జనగామ యాదగిరి, తాళ్లపెల్లి జగన్నాథం, గజ్జెల దామోదర్‌,  కలకోల పోచయ్య, శ్రీపతిపల్లి సర్పంచ్‌ కేసిరెడ్డి ప్రత్యుషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్యాణానికి వచ్చిన భక్తులకు ఆకుల సమ్మయ్య స్మారకార్థం సాంబరాజు మజ్జిగ పంపిణీ చేశారు. logo