మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 12, 2020 , 02:22:43

సోమేశ్వరస్వామి కల్యాణానికి మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం

సోమేశ్వరస్వామి కల్యాణానికి మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం

పాలకుర్తి, ఫిబ్రవరి 11 : పుణ్యక్షేత్రమైన పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి క్షీరగిరి క్షేత్రంలో నిర్వహించనున్న సోమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కార్యాలయంలో దేవస్థానం ఈవో మేకల వీరస్వామి, ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి రమేశ్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిశారు. ఈనెల 21వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు పాలకుర్తి దివ్యక్షేత్రంలో నిర్వహించే జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవానికి తరలిరావాని మంత్రికి ఆహ్వానం అందజేసినట్లు వారు తెలిపారు.

logo
>>>>>>