శనివారం 31 అక్టోబర్ 2020
Jagityal - Sep 29, 2020 , 02:11:12

అన్నదాతల ఆనందోత్సాహం

అన్నదాతల ఆనందోత్సాహం

  • రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ

హుజూరాబాద్‌: కేసీఆర్‌ సర్కారు తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి కర్షకలోకం జేజేలు పలుకుతున్నది. సోమవారం హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో గల వరంగల్‌ అర్బన్‌జిల్లా కమలాపూర్‌ మండలకేంద్రంలో 400కు పైగా ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ తీశారు. పర్కాల ప్రధాన రహదారి నుంచి ప్రారంభమైన ర్యాలీ రామాలయం మీదుగా కొనసాగింది. ఈ  కార్యక్రమానికి హాజరైన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌ ముందుగా తెలంగాణ తల్లి  విగ్రహానికి  పూలమాలలు వేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ నూ తన రెవెన్యూ చట్టంతో అవినీతికి  చెక్‌ పడను న్న దని చెప్పారు. కార్యక్రమంలో నేతలు కాజీపేట శ్రీనివాస్‌, కన్నెబోయిన శ్రీనివాస్‌ పాల్గొన్నారు.