బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 11, 2020 , 03:46:49

పల్లెకో ప్రకృతి వనం

పల్లెకో ప్రకృతి వనం

  • స్థల సేకరణకు కలెక్టర్‌ ఆదేశం
  •  ఏర్పాటుకు అధికారుల సన్నాహం
  • ఉపాధిహామీ నిధులతో నిర్మాణం

జగిత్యాల: పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అం దించేందుకు పార్కులు అందుబాటులో ఉంటా యి. వారాంతంలో సేద తీరేందుకు తమ పిల్లాపాపలతో కాసేపు పార్కులకు వెళ్లే అవకాశముం ది. అదే గ్రామాలైతే సహజసిద్ధంగానే ప్రకృతి సో యగాలకు పుట్టినిల్లుగా ఉంటాయి. అయినా ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ‘పల్లె ప్రకృతి వనం’ పేరుతో పార్కులను రాష్ట్ర ప్రభుత్వం ఏ ర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 380గ్రామ పంచాయతీలుండగా, ప్రతీ పంచాయతీ పరిధి లో ఎకరం స్థలంలో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ సర్పంచులకు సమాచారం అందించి, ప్ర కృతి వనం కోసం భూమిని గుర్తించాలని మండ ల అధికారులను ఆదేశించారు. దీంతో అధికారు లు గ్రామాల్లో ప్రభుత్వ భూములను అన్వేషించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయా గ్రామ పరిధి లో ప్రభుత్వ భూమి వివరాలను సేకరిస్తున్నారు. 

ఉపాధి నిధులతో నిర్మాణం..

పార్కులు ఏర్పాటు చేస్తే చిన్నపిల్లలకు ఆడుకునేందుకు, పెద్ద వారికి ఉదయం వాకింగ్‌, సాయంత్రం సేదతీరడానికి ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ పార్కులో వాకింగ్‌ ట్రాక్‌తోపాటు, పలు రకాల మొక్కలను నాటుతారు. వీటిని జాతీయ ఉపాధిహామీ పథకం నిధులతో నిర్మించనున్నారు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి వివిధ ఆట పరికరాలను పార్క్‌లో ఏర్పాటు చేయనున్నారు. 

పల్లె ప్రజలకు ఉపయోగం..

గ్రామాల్లో పార్కులను ఏర్పాటు చేయనుండడంతో పల్లె ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. పట్టణాల్లో మాత్రమే ఉండే పార్కులు, ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాల్లో కూడా అందుబాటులోకి రానుండడంతో పల్లెల్లోని చిన్నారులకు మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఆటలు ఆడుకునే వీలుంటుంది. 

ఉత్తర్వులు రాగానే పనులు.. 

పల్లెకో వనం పేరు తో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో నిర్మాణాల కోసం ప్రణాళిక రూపొందించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రాగానే జిల్లాలోని 380 గ్రామపంచాయతీల్లో పార్కుల ఏర్పాటు కోసం పనులు ప్రారంభిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా ఆటలు ఆడుకునేందుకు వీలుగా పార్కులుంటాయి.       

      - లక్ష్మీనారాయణ,  జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి 


logo