ఆదివారం 23 ఫిబ్రవరి 2020
గ్రామాల అభివృద్ధికే పల్లె ప్రగతి

గ్రామాల అభివృద్ధికే పల్లె ప్రగతి

Feb 10, 2020 , 01:21:32
PRINT
గ్రామాల అభివృద్ధికే పల్లె ప్రగతి

మల్యాల : గ్రామాల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందనీ, ఇది నిరంతరం కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి ఆదివారం మల్యాల మండలం మానాల, మ్యాడంపల్లిలో పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. జీపీలకు అందించిన ట్రాక్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వాహణ, వ్యర్థాల నిర్మూలన, మొక్కల సంక్షరణ కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేసి అందిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ  ప్రగతిలో పల్లెలే పట్టుగొమ్మలనే సామెతను ఉదహరించారు. మ్యాడంపల్లిలో ఎనిమిది కుల సంఘాల భవనాలకు రూ.36.80లక్షలు, మానాలలో 12కుల సంఘాల భవనాలకు రూ.55.20లక్షలు మొత్తం రూ.92లక్షలు కేటాయించినట్లు చెప్పారు. 

కార్యక్రమంలో ఎంపీపీ మిట్టపెల్లి విమలాదేవి, జడ్పీటీసీ సభ్యుడు కొండపలుకుల రామ్మోహన్‌ రావు, జడ్పీ కోఆప్షన్‌ స భ్యుడు సుభాన్‌, సర్పంచులు రౌతు గంగా మహేశ్వరి, నల్లాల లక్ష్మి, మల్యాల సర్పంచ్‌ మిట్టపెల్లి సుదర్శన్‌, ఎంపీటీసీ సభ్యురాలు ముదుగంటి అ నిత, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, నాయకులు రౌతు రవివర్మ, ముదుగంటి రాజేందర్‌ రెడ్డి, ఆగంతం వంశీ, వెంకట్‌ రెడ్డి, చీకట్ల అశోక్‌, భూపతి పాల్గొన్నారు.

  నర్సింహ స్వామిని 

దర్శించుకున్న ఎమ్మెల్యేలు

మండలంలోని మానాల శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు స్వామి వారిని దర్శిం చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాప కులు, స్వాతంత్య్ర సమరయోధులు గండ్ర రాఘ వేందర్‌ రావు ఎమ్మె ల్యేకు స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజే శారు. వారి వెంట జడ్పీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్‌ రా వు, ఎంపీపీ మిట్టపెల్లి విమలా దేవి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, నాయకులు బల్మూరి పాపారావు, రౌతు రవివర్మ, అయిల్నేని కోటేశ్వర్‌ రావు, మిట్టపెల్లి సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు.


logo