హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కుట్ర!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అధికార పీఠం నుంచి దింపే ప్రణాళిక ఆమె దేశం విడిచి పారిపోవడానికి రెండు రోజుల ముందే సిద్ధమైందని ఆ దేశ మాజీ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మాజీ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఆగస్టు 5న హసీనా దేశం విడిచివెళ్లకముందే విద్యార్థి నేతలు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
- 2 రోజుల ముందే యూనస్‌తో విద్యార్థి నేతల రహస్య చర్చలు
- సహకరించిన ఏఎఫ్‌పీ జర్నలిస్టు
- యూనస్ మాజీ ప్రెస్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అధికార పీఠం నుంచి దింపే ప్రణాళిక ఆమె దేశం విడిచి పారిపోవడానికి రెండు రోజుల ముందే సిద్ధమైందని ఆ దేశ మాజీ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మాజీ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఆగస్టు 5న హసీనా దేశం విడిచివెళ్లకముందే విద్యార్థి నేతలు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
ఈ మేరకు అక్టోబర్ 29న ఫేస్బుక్లో చేసిన పోస్టులో పలు కీలక విషయాలను తెలియజేశారు. విద్యార్థి నేతలకు, యూనస్‌కు మధ్య సంబంధాలు ఏర్పరచడంలో ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్(ఏఎఫ్‌పీ) జర్నలిస్టు ఖాదరుద్దీన్ షిషిర కీలక పాత్ర పోషించారని ఆలం పేర్కొన్నారు. అప్పట్లో ఆయన ఏఎఫ్‌పీ ఢాకా ఫ్యాక్ట్‌చెక్ బృందానికి సంపాదకునిగా పనిచేశారు. అధికార మార్పిడి గురించి కొద్దిమంది విశ్వసనీయ వ్యక్తులకు మాత్రమే తెలుసని ఆలం పేర్కొన్నారు. హసీనా భద్రతా వ్యవస్థకు ఈ పరిణామాల గురించి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. విషయం బయటపడితే ఏఎఫ్‌పీ బృందం మొత్తం రహస్య నిర్బంధ కేంద్రంలో చిక్కుకునే ప్రమాదం ఉండేదన్నారు. అప్పటి ప్రభుత్వ హయాంలో సామూహిక హత్యలు, అపహరణలు జరిగాయని ఆయన ఆరోపించారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ఆగస్టు 8న యూసన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
హసీనా పరారీని వీడియో తీసిన బంగ్లా మాజీ అధికారి అనుమానాస్పద మృతి
ఒక రోజు క్రితం అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి కేఎం తహసి శౌరీ అనుమానాస్పద స్థితిలో నదిలో శవమై కన్పించారు. డెయిలీ స్టార్ కథనం ప్రకారం.. విద్యార్థుల నిరసనతో అప్పటి ప్రధాని షేక్ హసీనా 2024, ఆగస్టు 5న దేశం వదిలి సైనిక హెలికాప్టర్లో పారిపోతున్న వీడియోను శౌరీయే రికార్డు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే తాను ఆ వీడియోను కేవలం షేర్ మాత్రమే చేశానని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

