ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషాలిటీ ఉన్నట్టుగా.. ఫుడ్‌లోనూ చాలా వెరైటీలు ఉంటాయి. ఒక ప్రాంతంలో దొరికే ఫుడ్ మరో ప్రాంతంలో దొరకదు. రాష్ట్రాలు, దేశాలు మారిన కొద్దీ.. ఫుడ్ అలవాట్లే కాదు.. తినే ఫుడ్డులోనూ చాలా తేడాలు ఉంటాయి. అందుకే.. కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన ఫుడ్ తినడానికే చాలామంది ఆసక్తి చూపిస్తారు.
మన దేశంలో అయితే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్ చాలా ఫేమస్. నార్త్ వాళ్లు.. సౌత్‌కు వస్తే.. సౌత్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తారు. సౌత్ వాళ్లు.. నార్త్‌కు వెళ్తే.. నార్త్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తారు. ఇక.. వేరే దేశాలకు వెళ్తే అక్కడి ఫుడ్‌ను కూడా ఎంజాయ్ చేస్తారు.
తాజాగా థాయిలాండ్‌కు చెందిన ఓ యూట్యూబర్.. తొలిసారి సౌత్ ఇండియన్ ఫుడ్‌ను టేస్ట్ చేశాడు. బ్యాంకాక్‌లో ఉన్న సుగమ్ అనే సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ బ్లాగర్ మార్క్ వీన్స్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు. సౌత్ ఇండియా థాలీ అంటే ఎలా ఉంటదో తెలుసు కదా. 10 రకాల కూరలు, కాసింత అన్నం, పులుసు, చట్నీ, వడ.. ఇలా అన్ని రకాల కూరలను టేస్ట్ చేసిన ఆ వ్యక్తి మైమరిచిపోయాడు. వావ్.. ఇటువంటి ఫుడ్ ఎప్పుడూ తినలేదు అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. చేతితో అన్నాన్ని కలుపుకొని ఆ వ్యక్తి తినేశాడు. చివర్లో పచ్చిపులుసును చేతుల్లో పోసుకొని వావ్ అనేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.