ఆస్ట్రేలియా : పదహారేండ్లలోపు పిల్లలు యూట్యూబ్ వినియోగించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను పిల్లలు వినియోగించడంపై ఇప్పటికే నిషేధం విధించగా, తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్‌ను కూడా చేర్చింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.
ఈ సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ పిల్లలకు హానికరంగా మారిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. సోషల్ మీడియాలో నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్న వారికి ఖాతాలు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చే సంస్థకు 4.95 కోట్ల డాలర్ల జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది.