హిజాబ్ ధరించనందుకు యువతి అరెస్ట్… మూడు రోజుల తర్వాత మృతి
ఈ సంఘటన ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్ కోడ్ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు కొన్ని వార్తా సంస్థలు ఆరోపించాయి.
టెహ్రాన్: హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌కు చెందిన ఒక యువతిని ఆ దేశ ‘నైతిక పోలీసులు’ అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న ఆ మహిళ మూడు రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సంఘటనపై ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 22 ఏళ్ల మహ్సా అమిని తన కుటుంబంతో కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సందర్శనకు వెళ్లింది. ఆ దేశ మహిళలు కఠినమైన దుస్తుల కోడ్ పాటించేలా బాధ్యత వహించే పోలీసులు ఆమె హిజాబ్ ధరించకపోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ యువతిని అరెస్ట్ చేశారు. అయితే నైతిక పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించగా ఆ మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా, ఈ సంఘటన ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్ కోడ్ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు కొన్ని వార్తా సంస్థలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు నిరసనకు దిగారు. ఆ యువతి మరణానికి కారణమైన పోలీసులను చట్టం ప్రకారం శిక్షించాలని నినాదాలు చేశారు.
మరోవైపు ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇరాన్‌లోని అమెరికా ప్రతినిధులు కూడా ఈ సంఘటనను ఖండించారు. చిత్రహింసలకు గురిచేసి యువతి మరణానికి కారణమైన వారిని న్యాయవ్యవస్థ ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

