బుధవారం 02 డిసెంబర్ 2020
International - Oct 30, 2020 , 18:35:16

సీడీసీ రిపోర్ట్ : యువత వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయ్...!

సీడీసీ రిపోర్ట్ : యువత వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయ్...!

వాషింగ్ టన్ :30 ఏండ్ల లోపు వయసు వారి వల్లనే కరోనా సామాజిక వ్యాప్తిగామారిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన నివేదికలో వెల్లడించింది. యువత లో మాస్క్ ధరించడం , సోషల్ డిస్టెన్స్ సరిగా పాటించని కారణంగా వృద్దులకు త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది.18నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో COVID-19 వ్యాప్తి తక్కువే అయినా... చనిపోయేవారు శాతమ్ చాల తక్కువని సీడీసీ అధ్యయనంలో వెల్లడైంది. COVID-19 తో యువత చనిపోయే ప్రమాదం తక్కువ గా ఉన్నప్పటికీ ఎలాంటి కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఉండడం వల్లే సమాజంలో ఎక్కువమంది కి వీరి ద్వారా సంక్రమిస్తున్నదని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆరోగ్యంగా ఉన్నవారితో సహా అన్ని వయసుల ప్రజలలో ఈ సంక్రమణ తీవ్రంగా మారుతుంది.

కరోనా వైరస్ కారణంగా గుండెలో మంట వస్తుంది. అంతేకాదు ఇది అన్ని వయసుల,  వారిలో  గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందట. ఇటీవల ప్రచురించిన సిడిసి నివేదిక ప్రకారం 2020 ఏప్రిల్ - జూన్ మధ్య 18 - 29 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. "వారి 20 ఏళ్ళ వయస్సులో ఉన్న యువకులు వృద్ధులకు ఈ వ్యాధి సంక్రమిస్తున్నదని మొదట్లోనే గ్రహించారు నిపుణులు. మహమ్మారిపై నియంత్రించ డానికి 20 - 30 ఏళ్ళలో వ్యక్తుల మధ్య సంక్రమణ రేటును తగ్గించడం చాలా అవసరం ”అని న్యూయార్క్ నగరంలోని లెనోక్స్ హిల్ హాస్పిటల్‌ వైద్యుడు డాక్టర్ రాబర్ట్ గ్లాటర్ తెలిపారు.

యువత సామాజిక దూరాన్ని తగ్గించారు... 

ఏప్రిల్ చివరిలో, మే ప్రారంభంలో , మే చివరిలో మూడు విడతలుగా కరోనా ఏవిధంగా వ్యాప్తి చెందుతున్నదనేదానిపై సర్వ్ నిర్వహించారు. ఇందులో ఫేస్ మాస్క్‌లు వాడే పెద్దల శాతం ఏప్రిల్‌లో 78 శాతం నుంచి జూన్‌లో 89 శాతానికి పెరిగిందని సిడిసి కనుగొన్నది. సామాజిక దూరం పాటించకపోవడం తో చాలావేగంగా కరోనా తీవ్రత పెరిగినట్లు వారు గుర్తించారు. ముఖ్యంగా యువత రెస్టారెంట్లకు మాత్రమే వెళ్ళలేదు. కానీ అన్ని ప్రాంతాలకు ఎటువంటి కోవిడ్ నిబంధనలు పాటించకుండానే తిరిగారని తేలింది.   అమెరికా యువత సరైన జాగ్రత్తలు పాటించని కారణంగానే కేసులు పెరిగాయని, అందుకోసమే యూత్ లో ముఖ్యంగా 18-29 మధ్య వయస్సులో నిబంధనల అవసరాన్ని నొక్కిచెప్పాలని గ్లాటర్ తెలిపారు.


కమ్యూనిటీ ట్రాన్స్మిషన్లో యువతదే కీలక పాత్ర. మనకు ఇంకా వ్యాక్సిన్ రాలేదు. కాబట్టి  వ్యాధి సంక్రమణ నే ప్రధానమని డాక్టర్ వైవోన్నే మాల్డోనాడో తెలిపారు. యువతలో ఎక్కువగా కనిపించే అసింప్టోమాటిక్ కేసులు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ట్రస్ట్డ్ సోర్స్‌కు ఆజ్యం పోయడం వంటివి. లక్షణం లేని వ్యక్తులు సోకినట్లు తెలియకుండానే వ్యాప్తి చేయగలరు కాబట్టి, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం కొనసాగించడం, చేతులు కడుక్కోవడం ,మాస్కులు ధరించడం చాలా ముఖ్యం అని అధ్యయన ఫలితాలు హెచ్చరిసున్నాయి.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.