ఇజ్రాయిల్: భారతీయురాలు హర్నాజ్ సంధు ఈ యేటి విశ్వసుందరిగా కీరిటాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. చంఢీఘడ్కు చెందిన ఈ అమ్మాయి.. విశ్వసుందరి పోటీల్లో తన పదునైన సమాధానాలతో ఆకట్టుకున్నది. మీపై మీరు నమ్మకం ఉంచుకోండి అన్న ఆమె డైలాగ్.. విశ్వవేదికపై ఆమెను సుందరిని చేసేసింది. నేటి రోజుల్లో వత్తిళ్లను ఎదుర్కొనేందుకు యువ ఆడపడుచులకు ఎటువంటి సలహా ఇస్తారని జడ్జిలు ఆమెను అడిగారు. ఆ సమయంలో హర్నాజ్ సంధు చాలా బలమైన సమాధానం ఇచ్చింది. తమపై తమకు నమ్మకం లేకపోవడమే నేటి యువతకు పెద్ద సమస్యగా మారిందని, అయితే మీరే విశిష్టమైన వాళ్లన్న అంశాన్ని గ్రహించడమే కీలకమని, ఇతరులతో పోల్చడం మానుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్య అంశాల గురించి మాట్లాడుకోవాలన్నారు. బయటకు వచ్చి.. మీ మనసులోని భావాల్ని చెప్పండని సంధు సలహా ఇచ్చారు. మీ జీవితానికి మీరే లీడర్ అని, మీ మాటకు మీరే కీలకమని, నాకు నాపై నమ్మకం ఉందని, అందుకే నేను ఇక్కడ ఈ పోటీల్లో నిలుచున్నానని హర్నాజ్ తెలిపింది. సంధు అని అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో ఇదే. ఒకసారి లుక్కేయండి.
FINAL STATEMENT: India. #MISSUNIVERSE
— Miss Universe (@MissUniverse) December 13, 2021
The 70th MISS UNIVERSE Competition is airing LIVE around the world from Eilat, Israel on @foxtv pic.twitter.com/wwyMhsAyvd