సనా : యెమెన్‌లోని అత్యధిక ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హౌతీ ప్రభుత్వ ప్రధాన మంత్రి అహ్మద్ అల్ రహవి గురువారం ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో మరణించారు. ఈ విషయాన్ని హౌతీలు శనివారం ధ్రువీకరించారు. యెమెన్ రాజధాని నగరం సనాలో జరిగిన ఈ దాడిలో కొందరు మంత్రులు కూడా మరణించారని తెలిపారు.
అగ్ర స్థాయి మంత్రులు మరణించినప్పటికీ, తాము ప్రభుత్వ విధుల నిర్వహణను కొనసాగిస్తామని హౌతీ ప్రెసిడెన్సీ ప్రకటించింది. అమర వీరుల రక్తం తమకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పింది.