జిన్పింగ్ కొత్త చరిత్ర
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికై.. ఆ ఘనత సాధించిన ఏకైక నాయకుడిగా అవతరించారు. అంతేకాదు.. కమ్యూనిస్టు చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ కంటే ఎక్కువకాలం చైనాను పాలించిన నేతగా కూడా రికార్డు సృష్టించబోతున్నారు.
- చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక
- వరుసగా మూడోసారి ఎన్నికైన ఏకైక నేత
బీజింగ్, అక్టోబర్ 23: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికై.. ఆ ఘనత సాధించిన ఏకైక నాయకుడిగా అవతరించారు. అంతేకాదు.. కమ్యూనిస్టు చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ కంటే ఎక్కువకాలం చైనాను పాలించిన నేతగా కూడా రికార్డు సృష్టించబోతున్నారు. జిన్పింగ్ను చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) జనరల్ సెక్రటరీగా పార్టీ స్టాండింగ్ కమిటీ ఆదివారం ఎన్నుకొన్నది. సీపీసీ అధినేతే చైనా అధ్యక్షుడిగా కొనసాగుతారు. 20వ సీపీసీ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఆసాంతం జిన్పింగ్ కనుసన్నల్లోనే సాగాయి. శనివారం పార్టీ సెంట్రల్ కమిటీని ఎన్నుకొన్నారు. 300 మంది ఉండే సెంట్రల్ కమిటీ పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులుగా 25 మందిని ఆదివారం ఎన్నుకొన్నది. ఆ వెంటనే అందులోంచి ఏడుగురిని స్టాండింగ్ కమిటీలోకి ఎన్నుకొన్నారు. ఆ ఏడుగురిలో నుంచి జిన్పింగ్ను మళ్లీ అధ్యక్షుడిగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నుకోవటం సాఫీగా సాగిపోయింది. జిన్పింగ్ 2012 నుంచి చైనా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదితో పదేండ్ల పాలన పూర్తవుతుంది. కమ్యూనిస్టు చైనా వ్యవస్థాపకుడు మావోను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకొన్నప్పటికీ పదేండ్లే చైనాను పాలించారు. కాగా, పార్టీ సమావేశాల నుంచి శనివారం మాజీ అధ్యక్షుడు హు జింటావోను అర్ధాంతరంగా బయటకు తీసుకెళ్లిన విషయంపై చైనా మీడియా వివరణ ఇచ్చింది. ఆయన అస్వస్థతకు గురికావటం వల్లే విశ్రాంతి గదికి తరలించారని జిన్హువా వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

