Xi Jinping : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా సైన్యంలో కీలకంగా ఉన్న జనరల్ ఝావో
జోంగ్కిని పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు చైనా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతడు ప్రభుత్వ
సలహాదారుగా కూడా కొనసాగుతున్నాడు. అలాగే, చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కాన్సులేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సభ్యత్వం
కూడా రద్దైంది.
వీటితోపాటు అతడికి సంబంధించిన అన్ని ప్రభుత్వ పోస్టుల నుంచి తొలగించింది. ఝావో సహా ఇతర సైనిక
నాయకుల తొలగింపునకు స్పష్టమైన కారణాల్ని మాత్రం చైనా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, అవినీతి అధికారులను
తొలగించే చర్యల్లో భాగంగా ఝావోతోపాటు ఇతర సీనియర్ జనరల్స్ అయిన ఝాంగ్ యుక్సియా, లియు ఝెనెల్ను కూడా
వారి పదవుల నుంచి తొలగించారు. జనరల్ ఝావో జోంగ్కి గతంలో చైనా ఆర్మీ అయిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ
(పీఎల్ఏ)లోని వెస్టర్న్ థియేటర్ కమాండ్‌కు నేతృత్వం వహించేవాడు. అతడి పరిధిలోనే గాల్వాన్ లోయ ఉండేది.
దీంతో
ఝావోనే ఇండియాపై గాల్వాన్ లోయలో దాడికి యత్నించాడు. ఇండియాకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే అతడు తన
సైన్యంతో గాల్వాన్ లోయలో రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డట్టు ప్రచారం జరిగింది. 2020లో జరిగిన గాల్వాన్ ఘర్షణతోపాటు
2017లో చైనా సరిహద్దు డోక్లాం ప్రతిష్టంభనకు కూడా ఝావోనే బాధ్యుడు.