గురువారం 04 జూన్ 2020
International - Apr 12, 2020 , 09:36:27

ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్‌-19 కారణంగా 1 లక్షా 8 వేల 822 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి 4 లక్షల 4 వేల 29 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, బెల్జియం, అమెరికా వంటి దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. కోవిడ్‌-19 మరణాలు అత్యధికంగా సంభవించిన దేశాల వివరాలిలా ఉన్నాయి. అమెరికాలో 20,577 మంది చనిపోగా, స్పెయిన్‌-16,606, ఇటలీ-19,468, ఫ్రాన్స్‌-13,832, జర్మనీ-2,871, చైనా-3,339, యూకే-9,875, ఇరాన్‌-4,357, టర్కీ-1,101, బెల్జియం-3,346, స్విర్జర్లాండ్‌-1,036, నెదర్లాండ్స్‌-2,643, బ్రెజిల్‌లో 1,140 మంది కోవిడ్‌-19 కారణంగా మృత్యువాతపడ్డారు.


logo