తాబేలు ఆయుష్షు అన్నింటి కంటే ఎక్కువ ఉంటుంది అంటారు. అది నిజమే అనిపిస్తుంది ఈ తాబేలు గురించి తెలుసుకుంటే. ఇప్పుడు మనం మాట్లాడుకునే తాబేలు పేరు జోనాథన్. దీని వయసు ఎంతో తెలుసా.. 190 ఏళ్లు. అవును.. ఇది 1832 లో పుట్టింది.
అత్యంత ఎక్కువ వయసు ఉన్న తాబేలుగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించింది. ఇది ప్రస్తుతం బ్రిటీష్ టెరిటరీలో ఉన్న సెయింట్ హెలెనా ఐలాండ్లో ఉంది. ఇటీవలే దీనికి 190వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
190 ఏళ్ల వయసు ఉన్న ఈ తాబేలు క్యాబేజీ, కీరదోశ, క్యారెట్, యాపిల్, అరటి పండ్లను మాత్రమే తింటుంది. ఇది అత్యంత వయసు ఉన్న తాబేలు మాత్రమే కాదు.. భూమ్మీద నడిచే జంతువులలో అత్యంత వయసు ఉన్న జంతువుగా రికార్డుకెక్కింది.