Israel-Iran | జెరూసలేం : ఇరాన్‌పై ప్రతిదాడులకు దిగొద్దని ఇజ్రాయెల్‌ను ప్రపంచ దేశాల నేతలు కోరారు. ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు ఇజ్రాయెల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిదాడులకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని యూకే విదేశాంగ శాఖ మంత్రి కామరూన్ స్పష్టం చేశారు.