బీజింగ్: తమ దేశంలోని గిజ్‌హౌ ప్రావిన్స్‌లో ఒక నది, లోయపైన 625 మీటర్ల (2,051 అడుగులు) ఎత్తులో హుయజియాంగ్ కెన్యాన్ వంతెనను ప్రారంభించినట్టు చైనా ప్రభుత్వ మీడియా ఆదివారం వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన అని తెలిపింది.
మూడేండ్ల కాలంలో దీన్ని నిర్మించినట్టు చెప్పింది. ఈ వంతెన పైలాన్లు మేఘాలను పాక్షికంగా తాకుతున్నాయా అనేలా అనిపించే వీడియోను ప్రభుత్వ టెలివిజన్ విడుదల చేసింది. ఈ వంతెన వల్ల గతంలో ఇరు వైపులా ప్రయాణానికి రెండు గంటలు పట్టేదని.. ఇప్పుడు కేవలం రెండు నిమిషాలు పడుతోందని ప్రొవిన్షియల్ రవాణా విభాగాధిపతి జాంగ్ ఇన్ తెలిపారు.