Ebola Outbreak: డీఆర్ కాంగోలో ప్రబలుతున్న ఎబోలా.. అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
Ebola Outbreak: డీఆర్ కాంగోలో ఎబోలా వ్యాధి ప్రబలుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందాల్సిన అంశమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. డీఆర్ కాంగోలోని తూర్పు ఇటూరీ ప్రావిన్సులో ఎబోలా వ్యాధి విస్తరిస్తోంది.
జెనీవా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి(Ebola Outbreak) ప్రబలుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందాల్సిన అంశమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. డీఆర్ కాంగోలోని తూర్పు ఇటూరీ ప్రావిన్సులో ఎబోలా వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 246 మందికి వైరస్ సోకింది. సుమారు 80 మంది మరణించారు. అయితే తాజా లెక్కల ప్రకారం మహమ్మారిగా మారకున్నా.. త్వరలోనే ఆ వ్యాధి మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్ ఇచ్చింది. బుండిబుగ్యో వైరస్‌కు చెందిన స్ట్రెయిన్ వల్ల ఎబోలా విస్తరిస్తున్నట్లు తెలిసింది.
అయితే ఈ రకం వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రస్తుతం ఎటువంటి డ్రగ్స్ కానీ, వ్యాక్సిన్లు కానీ లేవని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. తొలుత ఈ వ్యాధి వల్ల జ్వరం, నొప్పులు, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత దశలో వాంతులు, విరోచనాలు వస్తాయి. ఒంటిపై ర్యాష్‌లు, బ్లీడింగ్ జరుగుతుంది. ఇటూరి ప్రావిన్సులో ఈ కేసు నమోదు అయ్యింది. దేశ రాజధాని కిన్షాసాలో ఓ కేసు కన్ఫర్మ్ అయ్యింది. డీఆర్ కాంగో నుంచి వ్యాధి సమీప దేశాలకు వ్యాప్తి చెందినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. ఉగాండాలో కొత్త గా రెండు కేసులు నమోదు అయ్యాయి. ఓ వ్యక్తి పాజిటివ్‌గా తేలినట్లు ఉగాండా అధికారులు చెప్పారు. కాంగోకు చెందిన వ్యక్తే తమ దేశంలో చనిపోయినట్లు ఉగాండా ప్రభుత్వం పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

