కాబూల్: తాలిబన్ ఫైటర్ల తుపాకులకు ఆ దేశ మహిళలు భయపడటం లేదు. తాలిబన్ ఫైటర్ తుపాకీ ఎక్కుపెట్టినప్పటికీ ఒక మహిళ బెదరక నిరసన కొనసాగించింది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ దేశ మహిళలు తమ హక్కులు, ఇతర అంశాలపై గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. పంజ్‌షీర్‌లో పాక్ యుద్ధ విమానాల దాడులపై మంగళవారం కాబూల్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కాబూల్‌లోని పాక్ రాయబార కార్యాలయం ఎదుట ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తాలిబన్ ఫైటర్ ఒక మహిళకు తుపాకీ గురిపెట్టాడు. అయినప్పటికీ ఆమె బెదరక తన నిరసన కొనసాగించింది. రాయిటర్స్ జర్నలిస్ట్ తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆఫ్ఘనిస్థాన్ మహిళల దృఢ నిశ్చయానికి ఇది నిదర్శమని కొందరు నెటిజన్లు ప్రశంసించారు.
కాగా, కాబూల్‌లో మహిళలు తమ నిరసనను వరుసగా మూడో రోజూ కూడా కొనసాగించారు. కాబూల్ నగరానికి పశ్చిమాన ఉన్న దష్త్-ఇ-బార్చి నుంచి వారి నిరసన ప్రారంభమైంది. ‘మహిళలు లేని మంత్రివర్గం విజయవంతం కాదు’ అని మహిళలు నినాదించారు. ఈ సందర్భంగా తాలిబన్ ఫైటర్లు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ముందుకు సాగి నిరసన కొనసాగించారు.
Women continue their protest in Kabul for the third day in row.
— Zahra Rahimi (@ZahraSRahimi) September 8, 2021
Today, their protest started from Dasht-e- Barchi in the west of Kabul city. Women chanting “cabinet without women is unsuccessful”.#Afghanishtan
pic.twitter.com/sYRJ2DyD75