వాషింగ్టన్: విమానంలో ఒక మహిళ దరుసుగా ప్రవర్తించింది. విమాన సిబ్బంది, ప్రయాణికులను తిట్టడంతోపాటు ఒక వ్యక్తిపై వాటర్ బాటిల్ విసిరింది. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 12న ఒక మహిళ అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానం ఎక్కింది. ఆమె వెంట ఒక కుక్క పిల్ల ఉంది. ట్రావెల్ కేజ్లో ఉంచాల్సిన ఆ కుక్కను తన ఒడిలో ఉంచుకుంది. గమనించిన విమాన సిబ్బంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కుక్క పిల్లను కేజ్లో ఉంచాలని అన్నారు. ఆమె మాట వినకపోవడంతో విమానం నుంచి దిగి పోవాలని చెప్పారు.
దీంతో ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు హంగామా చేసింది. ఇబ్బంది కలిగించకుండా విమానం దిగాలన్న ఒక ప్రయాణికుడిపై వాటర్ బాటిల్ విసిరింది. మొబైల్లో వీడియో రికార్డు చేయడాన్ని ఆపాలంటూ కేకలు వేచి రచ్చ చేసింది. చివరకు ఆ మహిళను బలవంతంగా ఆ విమానం నుంచి కిందకు దింపేశారు.
అయితే ఆ మహిళ దురుసు ప్రవర్తనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, దీంతో ఆమెను అరెస్ట్ చేయలేదని అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. మరోవైవు విమానంలో ఆ మహిళ రచ్చ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A female passenger was kicked off from #Delta's flight from #Atlanta to #NewYork. The passenger was told by the crew to get off the plane after refusing to put her dog into a carry case, also threw a bottle of water at other passenger. 🎥©Vincentscrows/Reddit#DeltaAirlines pic.twitter.com/aVhTx4nnLz
— FlightMode (@FlightModeblog) October 15, 2022