తాడు కట్టకుండానే తోసేశారు!
బంగీ జంప్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాలను బలిగొన్నది. తాడు కట్టకుండానే యువతిని 130 అడుగుల ఎత్తు నుంచి విసిరివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లో శనివారం ఈ ఘటన జరిగింది. మృతురాలిని మరియా ఎడ్యుర్డా రొడ్రిగస్ డి ఫ్రీటస్గా గుర్తించారు.
- బంగీ జంప్ నిర్వాహకుల నిర్లక్ష్యం.. యువతి మృతి.. బ్రెజిల్లో ఘటన
సాయ్ పౌలో : బంగీ జంప్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాలను బలిగొన్నది. తాడు కట్టకుండానే యువతిని 130 అడుగుల ఎత్తు నుంచి విసిరివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లో శనివారం ఈ ఘటన జరిగింది. మృతురాలిని మరియా ఎడ్యుర్డా రొడ్రిగస్ డి ఫ్రీటస్గా గుర్తించారు. స్టేట్ ఆఫ్ సాయ్ పౌలోలోని స్కెలిటన్ వంతెన మీద ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించిన బంగీ జంప్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆమెను కిందకు వదిలివేయడానికి ముందు నిర్వాహకులు ఆమె కాళ్లకు తాడు కట్టడం మరిచిపోయారు.
ఆ విషయం గుర్తించకుండానే ఆమెను కిందకు తోశారు. ఇది గుర్తించిన ప్రత్యక్ష సాక్షులు ‘అయ్యో తాడు లేదు’ అని అరిచారు. కానీ ఆమెకు సాయం అందించే లోపే ఆమె కింద ఉన్న లోయలోకి పడి ప్రాణాలు విడిచింది. ఆమె బంగీ చేస్తున్నప్పుడు ఆమెకు కాబోయే భర్త అక్కడే ఉన్నారు. అయితే ఆమె మరణ వార్త విన్నాక అతడు అస్వస్థతకు గురయ్యాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

