Wildfire | వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ర్టాన్ని భీకరమైన కార్చిచ్చు చుట్టుముట్టింది. వేలాది ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కేవలం ఐదు గంటల వ్యవధిలో మంటలు 62 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించటంతో భయాందోళన నెలకొన్నది.
అధికారులు లాస్ ఏంజెల్స్ సమీప ప్రాంతాల్లోని 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సబర్బన్ కమ్యూనిటీల్లో, వ్యవసాయ ప్రాంతాల్లో దాదాపు 3,500 భవనాలకు ప్రమాదం పొంచి ఉందని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ హెచ్చరికలు జారీ చేశారు.
లాస్ ఏంజెల్స్‌లో దట్టమైన పొగ ఆకాశంలో వందల అడుగుల ఎత్తులో విస్తరించింది. నగరం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఈ పొగ కమ్మేసింది.