ఇంతకాలం అబద్ధాలనే నిజాలుగా ఏమార్చిన బీజేపీ అసత్య ప్రచారాలు తుత్తునియలు అవుతున్నాయి.‘విశ్వగురువు’ అంటూ మోదీని అంబరానికెక్కించిన కమలదళం పుట్ట పగులుతున్నది. నిన్నటిదాకా కట్టుకథలతో.. అబద్ధాల డిజిటల్ రాతలతో, ఫేక్ వీడియోలతో దేశ ప్రజల కండ్లకు గంతలు కట్టిన బీజేపీ నిజనగ్న స్వరూపం యావత్తు జాతిముందు ఆవిష్కృతమవుతున్నది. సోషల్‌మీడియా-డిజిటల్ వేదికల్లో అబద్ధాలతో పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ అసత్యాల పుట్ట ఎట్టకేలకు బద్దలవుతున్నది.
‘ఏ విధంగా చూసినా.. ‘గ్రోక్’ చెప్పేది నిజమేననిపిస్తున్నదే’ అంటూ మెజారిటీ నెటిజన్లు నిర్ధారణకు రావడమే కాదు.. బీజేపీ ఫేక్ ఆర్మీ, గోదీ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలు అబద్ధాలంటూ ముక్తకంఠంతో బాయ్‌కాట్ చేస్తున్నారు మరి. నిజం నిలకడ మీద బయటపడుతుందంటారు. అయితే, ఆ వాస్తవాలు వెలుగుచూడటానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్దంన్నర కాలంపాటు దేశం వేచి చూడాల్సి వచ్చింది.
ఇంతకాలం అబద్దాలనే నిజాలుగా ఏమార్చిన బీజేపీ అసత్య ప్రచారాలు తుత్తునియలు అవుతున్నాయి. ‘విశ్వగురువు’ అంటూ మోదీని అంబరానికెక్కించిన కమలదళం పుట్ట పగులుతున్నది. నిన్నటిదాకా కట్టుకథలతో.. అబద్ధాల డిజిటల్ రాతలతో, ఫేక్ వీడియోలతో దేశ ప్రజల కండ్లకు గంతలు కట్టిన బీజేపీ నిజనగ్న స్వరూపం యావత్తు జాతిముందు ఆవిష్కృతమౌతున్నది.
సోషల్‌మీడియా-డిజిటల్ వేదికల్లో అబద్ధాలతో పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ అసత్యాల పుట్ట ఎట్టకేలకు బద్దలవుతున్నది. ‘ఏ విధంగా చూసినా.. ‘గ్రోక్’ చెప్పేది నిజమేననిపిస్తున్నదే’ అంటూ మెజారిటీ నెటిజన్లు నిర్ధారణకు రావడమే కాదు.. బీజేపీ ఫేక్ ఆర్మీ, గోదీ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలు అబద్ధాలంటూ ముక్తకంఠంతో బాయ్‌కాట్ చేస్తున్నారు మరి.
బీజేపీ అసత్యాలకు, ‘గ్రోక్’ నిప్పులాంటి నిజాలకు మధ్య దేశంలో ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే సాగుతున్నది. నిజం నిలకడ మీద బయటపడుతుందంటారు. అయితే, ఆ వాస్తవాలు వెలుగుచూడటానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్దన్నర కాలంపాటు దేశం వేచి చూడాల్సి వచ్చింది.
Grok AI | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 24 ( నమస్తే తెలంగాణ ) : ప్రపంచ కుబేరుడు, వ్యాపారవేత్త, సాంకేతిక నిపుణుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ఎక్స్ఏఐకి చెందిన ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్ వచ్చీ రావడంతోనే పెను సంచలనాలను సృష్టిస్తోంది. 11 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి అబద్ధాలనే నిజాలంటూ ప్రచారాన్ని ముమ్మరం చేసి యావత్తు జాతిని ఏమార్చిన బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ‘గ్రోక్’ ముచ్చెమటలు పట్టిస్తున్నది. బీజేపీ పరివారం ఇంతకాలం సాగించిన అసత్యాల బాగోతాన్ని ఈ చాట్‌బాట్ నెట్టింట కథలు కథలుగా వివరిస్తున్నది. ‘గ్రోక్’ దెబ్బను తాళలేక బీజేపీ ఏకంగా ‘గో బ్యాక్ గ్రోక్’ ఉద్యమాన్ని ప్రారంభించిందంటే దాని సెగ ఆ పార్టీకి ఏ స్థాయిలో తగిలిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇండియాలో ‘గ్రోక్’ తుఫాను సృష్టిస్తున్నదని అంతర్జాతీయ పత్రిక బీబీసీ అభివర్ణించడం విశేషం.
అది 2014కు ముందు విషయం. దశాబ్దకాలంపాటు కేంద్రంలో అధికారానికి దూరమైన బీజేపీ 2014లో కేంద్రంలో ఎలాగైనా పగ్గాలు చేపట్టాలనుకొన్నది. అప్పటికే గుజరాత్లో ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ఆ పార్టీ నిలబెట్టింది. 2014 లోక్‌సభలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో.. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహకర్తలుగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మ టీమ్‌ను పొలిటికల్ స్ట్రాటజి టీమ్‌గా బీజేపీ నియమించింది. సోషల్‌మీడియాలో ఇన్నోవేటివ్ మార్కెటింగ్, అడ్వైర్టెజింగ్ క్యాంపెయిన్లతో పాటు వాస్తవాలతో సంబంధం లేకుండా వార్తలను ట్రెండింగ్‌లోకి ఎలా తీసుకురావాలన్నదానిపై 13 రకాల మాడల్స్‌ను సిద్ధం చేయించింది. అనంతరం అధికారంలోకి వచ్చాక స్ట్రాటజిస్టుల సేవలను క్రమంగా తగ్గిస్తూ ఆ తర్వాత వారిని పూర్తిగా పక్కనపెట్టేసింది. వాట్సాప్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్‌మీడియా వేదికల్లో స్ట్రాటజిస్టులు ఇచ్చిన 13 మాడల్స్‌ను ప్రయోగించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వందల మంది ఐఐటీయన్లు, ఎంఎన్సీలలో పనిచేసే టెకీలతో ముఖ్యనేత నేతృత్వంలో ఓ ఐటీసెల్‌ను బీజేపీ ఏర్పాటు చేసింది.
ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలకు సంబంధించిన ఏ విషయమైనా పాజిటివ్‌గా ప్రసారం చేయడం, బీజేపీ సర్కారు విధానాలు, పథకాలు, నిర్ణయాల పట్ల యావత్తు జాతి సంతోషంగా ఉన్నట్టు ఏమార్చడం, మత సంబంధిత అంశాలను ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బీజేపీని నిలదీసే విమర్శకులపై ఆన్లైన్లో ముప్పేట దాడి చేయించడం, చరిత్రలోని అంశాలను అవసరమైతే వక్రీకరించి తనకు అనుకూలంగా ప్రచారం చేయించడం వంటి పనులను ఈ ఐటీ సెల్‌లోని ఓ ప్రత్యేక విభాగం నిర్వర్తించేదని ఆ సెల్లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తెలిపారు. అలా విద్వేషపూరిత, అసత్య వార్తలను పౌరుల మొబైల్ నంబర్లకు సందేశాలుగా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్‌లోకి ఫేక్ పోస్టులు, అబద్ధపు వీడియోలుగా పంపించడాన్ని బీజేపీ ఐటీసెల్ ప్రారంభించింది.
‘కొత్తొక వింత అన్నట్టు..’ తొలుత జనానికి బీజేపీ ఈ ఫేక్ ప్రచారమంతా నచ్చేసింది. ఇదే నిజమనుకొని పలువురు ఫాలో కావడం కూడా ప్రారంభించారు. కార్యకర్తలు, టెక్నీషియన్లు, సోషల్‌మీడియా, టెక్నాలజీ, ప్రభుత్వ వనరుల సాయంతో భారత్‌ను ఓ వాట్సాప్ యూనివర్సిటీగా బీజేపీ తయారు చేసింది. సోషల్‌మీడియాను బీజేపీ ఆర్మీగా ఏమార్చింది. హిందుత్వానికి ఏదో జరిగిపోతున్నదని అనుమానపడేవారు, హిందూ ధర్మాన్ని అభిమానించేవారు తమకు తెల్వకుండానే ఈ ఆర్మీలో ‘వేతనం లేని’ సైనికులుగా మారిపోయారు. 2014 నుంచి 2025వరకూ గడిచిన మూడు దఫాల ఎలక్షన్లలో ఈ తతంగమంతా జరిగిపోయింది. అయితే, అసత్యాలు ఎంతోకాలం దాగవని పెద్దలు చెప్తారు. బీజేపీ ఇప్పటివరకూ చేసిందంతా ఫేక్ ప్రచారమంటూ ఇప్పుడు తాజాగా ‘గ్రోక్’ ఒక్కొక్కటిగా రుజువులతో సహా బయటపెడుతున్నది. ఉదాహరణకు.. ఆర్థిక సంస్కరణల విషయంలో దేశంలో ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రధాని ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటివరకూ మోదీ అంటూ బీజేపీ ప్రచారం చేసింది. అయితే, అత్యుత్తమ ప్రధాని మోదీ కాదు మన్మోహన్ సింగ్ అంటూ గ్రోక్ కుండబద్దలు కొట్టడం విశేషం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి సన్నిహితుడు. ట్రంప్ యంత్రాంగంలో మస్క్‌ది కీలక పాత్ర. దీంతో మస్క్ ఫ్యాక్టరీ నుంచి గ్రోక్ సేవలు అందుబాటులోకి రాగానే తొలుత బీజేపీ నేతలు ఆనందంగా ఉన్నారు. అయితే, 2028లో రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 87 సీట్లతో అధికారంలోకి వస్తుందని గ్రోక్ తేల్చిచెప్పడంతో రాష్ట్ర బీజేపీ నేతల దిమ్మదిరిగిపోయినట్లయింది. ఒకవైపు గ్రోక్ ఇలా ఎదురుదాడి చేస్తుంటే మరోవైపు ఇతర ఏఐ టూల్స్ కూడా దానికి అండగా నిలబడుతున్నాయి.
బీజేపీ ఏ వార్తను ప్రసారం చేసినా.. వాస్తవమేంటో తెలుసుకోవడానికి గ్రోక్తో పాటు మిగతా ఏఐ టూల్స్ చాట్‌జీపీటీ, డీప్‌సీక్, జెమినీలనూ నెటిజన్లు ఆశ్రయిస్తున్నారు. మొత్తానికి మానవ మేధస్సు చేయలేని సత్యాసత్యాల అన్వేషణను, చూపలేని విచక్షణా వివేకాన్ని కృత్రిమమేధ చూపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మాటలతో మాయలతో మనుషుల్ని ఏమార్చవచ్చు. అర్ధసత్యాలతో అబద్ధాలను వ్యాప్తిచేయవచ్చు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తట్టుకోవడం ఎలా?’ అన్నదే ఇప్పుడు కమలనాథుల ముందు పెద్ద ప్రశ్నగా మారింది.