శనివారం 06 జూన్ 2020
International - Apr 23, 2020 , 19:19:53

కోవిడ్ మ‌ర‌ణాలు.. స‌గం ఆశ్ర‌మాల్లోనే !

కోవిడ్ మ‌ర‌ణాలు.. స‌గం ఆశ్ర‌మాల్లోనే !

హైద‌రాబాద్: కేర్ హోమ్స్‌లో ఉన్న వారే ఎక్కువ‌గా మ‌ర‌ణిస్తున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కోవిడ్‌19 వ‌ల్ల యూరోప్ దేశాల్లో మ‌ర‌ణించిన వారిలో ఎక్కువ శాతం మంది కేర్ హోమ్స్‌కు సంబంధించిన‌వారే అని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది. ఈ విష‌యాన్ని యూరోప్ రీజిన‌ల్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ హ‌న్స్ క్లూజ్ తెలిపారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హెగ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు మ‌రింత స‌హాయం కావాల‌న్నారు.  కేర్ హోమ్స్‌లో ఉన్న‌వారికి అన్ని ర‌కాల వ‌స్తువులు అందించాల‌న్నారు. ఆశ్ర‌మాల్లో ఉన్న‌వారికి వైద్య స‌దుపాయాన్ని సంపూర్ణంగా అందించ‌డం హ‌క్కుగా భావించాల‌న్నారు. వృద్ధ ఆశ్ర‌మాల్లో ప‌నిచేస్తున్న వారికి స‌రైన వేత‌నాలు అంద‌డం లేద‌న్నారు. మ‌హ‌మ్మారి స‌మ‌యంలో వారు చూపిస్తున్న‌ తెగువ అసామాన్య‌మైంద‌న్నారు.  కేర్ హోమ్స్‌లో ఉన్న‌వారికి కూడా పీపీఈ కిట్లు అందేలా చూడాల‌న్నారు. logo