న్యూయార్క్ : భారత సంతతికి చెందిన తెలుగు ఫిజిషియన్ బాబీ ముక్కామల అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 180వ అధ్యక్షునిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సంస్థ సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి ఫిజిషియన్ ఆయనే. ఈ సంఘానికి చెందిన సబ్స్టేన్స్ యూజ్ అండ్ పెయిన్ కేర్ టాస్క్ ఫోర్స్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నిపుణుడు.
ఆయన మెదడులో 8 సెంటీమీటర్ల కణతి ఉన్నట్లు నిరుడు నవంబరులో గుర్తించారు. ఆయన తల్లిదండ్రులు 1970వ దశకంలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లి, మిషిగన్‌లోని ఫ్లింట్‌లో స్థిరపడ్డారు. వారిద్దరూ కూడా ఫిజిషియన్లే.