Seetha Payanam | అర్జున్ దర్శకత్వంలో ‘సీతా పయనం’.. వాలంటైన్స్ కానుకగా గ్రాండ్ రిలీజ్
Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘సీతా పయనం’.
Action King Arjun | యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ వెండితెరకు కథానాయికగా పరిచయం అవుతుండటం విశేషం. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించగా, అర్జున్ స్వయంగా ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. అలాగే ఆయన మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కూడా ఈ మూవీలో స్పెషల్ కామియో రోల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పాటలు, ఇతర కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే హృద్యమైన అంశాలతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని అర్జున్ అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా పదునైన డైలాగ్స్ రాశారు. యాక్షన్ కింగ్ సినిమా అంటేనే ఫైట్స్ స్పెషల్‌గా ఉంటాయి కాబట్టి, ఈ చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వినూత్న ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల్లోకి వెళ్తున్న మేకర్స్, త్వరలోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 14న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సీతా పయనం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
Eight days, one heartbeat, and a love that’s ready to take its final step onto the big screen 💜
🌍 #SeethaPayanam WORLDWIDE RELEASE | FEB 14, 2026
Telugu | Kannada | Tamil | Malayalam | Hindi pic.twitter.com/ybHbf6C1kM— HIFItalkies (@HiFiTalkies) February 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

