WHO | బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో తొలి మరణం.. నిర్ధారించిన డబ్ల్యూహెచ్‌వో
బర్డ్‌ఫ్లూ (Bird flu) హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.
న్యూఢిల్లీ: బర్డ్‌ఫ్లూ (Bird flu) హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. డయేరియా, వాంతుల లాంటి లక్షణాలతో దవాఖానలో చేరిన 59 ఏండ్ల వ్యక్తి ఏప్రిల్ 24న మరణించారని పేర్కొంది. ఈ మేరకు మెక్సికో తమకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే అతడు పౌల్ట్రీ, జంతువుల వద్దకు వెళ్లినట్లు ఆధారాలు కూడా లేవని చెప్పింది.
కాగా, బాధితుడికి మొదటి నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారని, వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే అతడికి వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది అనేది ఇంకా తేలలేదని చెప్పింది. మెక్సికోలో పౌల్ట్రీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారని, అక్కడి నుంచి మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. గత మే నెలలో మెక్సికోలోని మిచావ్కాన్ రాష్ట్రంలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు నమోదైందని వెల్లడించింది.
మరోవైపు బర్డ్‌ఫ్లూలోనే మరో వేరియంట్ హెచ్5ఎన్1 అమెరికా డెయిరీల్లో వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న కొంత మందికి ఇది సోకినట్లు నిర్ధరించుకున్నారు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు ఇంకా నిర్ధరణకాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

