Multnomah Falls: భార్య, ఐదుగురు పిల్లల ముందే దారుణం.. జలపాతం చూసేందుకు వెళ్లి..
Multnomah Falls: భార్య, అయిదుగురు పిల్లలతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లిన వ్యక్తి లోయలో పడిపోయాడు. దీంతో ఆ వ్యక్తి తన ఫ్యామిలీ ముందే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘనట ఓరేగాన్ రాష్ట్రంలోని ఉన్న కొలంబియా నది జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది.
ఓరేగావ్: అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో కొలంబియా నదిపై ఉన్న ముల్తనోమా జలపాతం(Multnomah Falls) వద్ద విషాద ఘటన జరిగింది. 40 ఏళ్ల గెర్రాడో హెర్నాండేజ్ రోడ్రిగ్జ్ అనేవ్యక్తి తన భార్య, అయిదుగురు పిల్లలతో కలిసి ఆ జలపాతం చూసేందుకు వెళ్లాడు. అయితే కొండపై వాకింగ్ చేస్తున్న సమయంలో అతను జారిపడ్డాడు. భార్యా, పిల్లల ముందే ఆ వ్యక్తి సుమారు 150 అడుగుల లోతు ఉన్న లోయలోకి పడిపోయాడు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జూలై 2వ తేదీన జరిగింది. వాటర్‌ఫాల్ వద్ద ఉన్న బెన్సన్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకున్నది. బహుశా మద్యం సేవించి ఉండడం వల్ల అతను జారిపడి ఉంటాడని అధికారులు చెబుతున్నారు. దాదాపు 45 నిమిషాలు వెతికిన తర్వాత అతని శరీరాన్ని గుర్తించారు.
ముల్తనోమా జలపాతం వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న వాకింగ్ ట్రాక్‌పై నడవడం అంత సులువు కాదు. హైకింగ్ ట్రయల్ కావడం వల్ల సరైన పాదరక్షలతో ఆ జలపాతం వెంట నడవాల్సి ఉంటుందని ఒకరు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

