Brain-Eating Amoeba: దక్షిణ కొరియాలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు.. ఆ ఇన్ఫెక్షన్ ఏంటో తెలుసా?
brain-eating amoeba దక్షిణ కొరియాలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు నమోదు అయ్యింది. దీన్నే నగలేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ వ్యాది సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతనికి థాయిలాండ్‌లో ఆ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఆ వ్యక్తి కొరియా వచ్చాడు. అంతకు
సియోల్: దక్షిణ కొరియాలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు నమోదు అయ్యింది. దీన్నే నగలేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ వ్యాధి సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతనికి థాయిలాండ్‌లో ఆ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఆ వ్యక్తి కొరియా వచ్చాడు. అంతకుముందు నాలుగు నెలల పాటు ఆయన థాయ్‌లాండ్‌లో ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ గురించి కొరియా వ్యాధుల నియంత్రణ ఏజెన్సీ పేర్కొన్నది.
నగలేరియా ఓ సూక్ష్మజీవి. ఇది ఏక కణ జీవి. సాధారణంగా నదుల్లో, చెరువులు, వాగుల్లోనూ ఈ రకమైన అమీబా ఉంటుంది. కానీ అన్నింటికీ ప్రాణాంతక శక్తి ఉండదు. కానీ నగలేరియా ఫ్లవరీ మాత్రం మనుషులకు సోకుతుంది. అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ ప్రకారం.. ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి నగలేరియా ప్రవేశించి.. అది బ్రెయిన్‌కు చేరుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న నరాలను ఆ అమీబా దెబ్బతీస్తుంది. పీఏఎం అంటే ప్రైమరీ అమీబిక్ మెనింజోఇన్సెఫిలైటిస్ అనే వ్యాధికి కారణం అవుతుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి. అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకుతుంటుంది.
పీఏఎం సోకినప్పుడు తల ముందు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. జ్వరం, వాంతులు, మెడ పట్టేయడం లాంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. ఒకవేళ పరిస్థితి సీరియస్‌గా ఉంటే, అది మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. 1962 నుంచి 2021 వరకు అమెరికాలో 154 పీఏఎం కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో కేవలం నలుగురు మాత్రమే బ్రతికినట్లు సీడీసీ వెల్లడించింది. నగలేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ మనుషుల నుంచి మనుషులకు సోకదు. ఈ వ్యాధి చికిత్స కోసం కొన్ని డ్రగ్స్ వాడుతుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

